కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూ చాలా బాగుంది,సినిమాకు ప్లస్ అవుతుంది

updated: February 16, 2018 15:10 IST

ఈ రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి...నాని నిర్మించిన  ‘అ’, మహేష్ బాబు సోదరి మంజుల మొట్టమొదటిసారి డైరెక్టర్ గా మారి చేస్తున్న ‘మనసుకు నచ్చింది ‘ తో పాటు    ‘రచయిత ’సినిమా  రిలీజైంది.  అయితే ఆ రెండు సినిమాలకు సెలబ్రెటీల సపోర్ట్ ఉండటంతో అందరి దృష్టీ ఆ సినిమాల పైనే ఉంది.  మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. విద్యాసాగర్ రాజు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ నటించిన చిత్రం "రచయిత". దుహర మూవీస్ పతాకంపై కళ్యాణ్ ధూలిపల్ల ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీని నిర్మించారు. 

 ఈ సినిమా కథేంటంటే... . 1950 లో...ఆదిత్య వర్మ (విద్యా సాగర్ రాజు) చిన్న వయస్సులోనే తన టీచర్ కూతురైన పద్మావతి (సంచిత పదుకునే)కు ఓ లవ్ లెటర్ ఇస్తాడు. దాంతో టీచర్ ఆదిత్యవర్మను మందలిస్తుంది. అప్పటి నుంచి  పదమూడు సంవత్సరాల పాటు పద్మావతికి దూరం అవుతాడు. ఈ గ్యాప్ లో అతనో పెద్ద రచయితగా ఎదుగుతాడు. ఎన్నో కథలు రాస్తాడు. మంచి పేరు వచ్చిన తర్వాత తన చిన్ననాటి ప్రేయసి పద్మావతిని చూడ్డానికి వెళ్లి ..ఆమెకు పెళ్లైందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆమె భర్త పెళ్లైన కొన్నాళ్లకే చనిపోయాడని వినటంతో ...ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని భావిస్తాడు. ఆ సమయంలో అతని జీవితంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటి..వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మిగతా కథ.

ఈ సినిమా పై కత్తి మహేష్ తన రివ్యూ ని తెలిపాడు. ఇంతకు ముందు హారర్ జోనర్ లో చాల సినిమాలు వచ్చాయని, కానీ కవితాత్మకంగా హారర్ సినిమాను ఎవరూ తియ్యలేదని సినిమా మేకర్స్ ను మెచ్చుకున్నాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుందని, ఈ సినిమాలోని ప్రతి పాత్ర మన నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు.

డైలాగ్లు అన్ని చాల పొయాటిక్ గా ఉన్నాయని, 1950 లోని ఈ కథను కరుణాకర్ రాసిన డైలాగ్స్ ఈ తరానికి కూడా బాగా కనెక్ట్ అవుతాయని ఆయన తెలియజేశాడు. అయితే మొత్తం మీద ఈ రచయిత సినిమా అచ్చ తెలుగు సినిమా, అందంగా తీసిన సినిమా, అద్భుతమయిన సినిమా అని తన మనసు లోని భావాలను తెలియజేశాడు. ఈ సినిమా డైరెక్టర్, హీరో సాగర్, నిర్మాత కళ్యాణ్ కు తన అభినందనలు తెలిపాడు.

ఈ సినిమా కి కత్తి మహేష్ రివ్యూ :3.5 /5

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments