తొలి ప్రేమ...ఫలించింది,పెళ్లి బాజా మోగుతోంది

updated: February 14, 2018 17:32 IST
తొలి ప్రేమ...ఫలించింది,పెళ్లి బాజా మోగుతోంది

తెలుగులో హృదయం ఎక్కడుంది చిత్రంలో నటించిన సంసృతి షెనాయ్ గుర్తుందా...మళయాళ,కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది.  తన స్నేహితుడు విష్ణుని ఆమె వివాహం చేసుకోబోతోంది.  కాగా వీరిద్దరి ప్రేమకు పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే  కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి జరగనుంది.   ఇప్పటికే  వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.  

 

ఓ ఇంటర్వూలో తన ప్రేమ గురించి ఆమె చెప్తూ... దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ..తన కాబోయే భర్త విష్ణుకు చెందిన ఓ బిజినెస్ వెంచర్ ఇనాగరేట్ చేయటానికి వెళ్లానని, అప్పుడే పరిచయం జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తామిద్దరం స్నేహితులు కావటం..మెల్లిగా ప్రేమలో పడటం జరిగిందని అంది. తమ ప్రేమ సక్సెస్ కావటానికి రెండు కుటుంబాల వాళ్లు ఇచ్చిన సపోర్టే కారణం అంటుంది. సంస్కృతి..మంగుళూరు నుంచి వచ్చి కొచ్చిలో సెటిలైన ఫ్యామిలి. ఆమె భరతనాట్యం లో డిప్లమో కోర్స్ చేసింది..ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీకు ప్రయత్నం చేస్తోంది.

 హృదయం ఎక్కడుంది చిత్రంతో టాలీవుడ్‌ కు వచ్చిన సంస్కృతి ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో మళయాళ, కన్నడ పరిశ్రమల పైనే దృష్టి సారించింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఒక ప్రక్కన నటిస్తూనే ఆమె వివిధ ప్రొడక్టులకు మోడలింగ్ కూడా చేస్తోంది. 

comments