బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందీ సినిమా.

updated: February 24, 2018 23:29 IST
బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందీ సినిమా.

మంచు విష్ణుకు మంచి హిట్ గ్యారెంటీ

విజయవంతమైన  ‘దేనికైనా రెడీ’ తర్వాత మంచు విష్ణు మళ్ళీ బ్రాహ్మణుడిగా నటించిన చిత్రం  ‘ఆచారి అమెరికా యాత్ర’. ఈ రెండు సినిమాలకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మంచు విష్ణు నటించిన కామెడీ చిత్రాలు మంచి సక్సెస్ అవటం, ముఖ్యంగా బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్...ఢీ చిత్రంలోనూ, ఆ తర్వాత   ‘దేనికైనా రెడీ’ లోనూ బాగా వర్కవుట్ అవటంతో ఈ చిత్రంపై   మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ చిత్రానికి కథ అందించటం మరో విశేషం. ఆయన అభిమానులు సైతం ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అయితే   ‘దేనికైనా రెడీ’ విడుదల సమయంలో జరిగిన వివాదాస్పద  అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమా ఎందుకని దర్శకుడు నాగేశ్వరరెడ్డి అనుకున్నారట. కానీ,   నిర్మాతలు ఒక్కసారి కథ వినమనటం.. విన్నాక. విపరీతంగా నచ్చడంతో అంగీకరించాను.  ఇందులో హాస్యంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయనిపించింది. అలాగే  బ్రాహ్మణులు గొప్పగా ఫీలచ్చే చిత్రమిది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లలో... వాళ్ల గురించి గొప్పగా చెప్పే సన్నివేశాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. 

కథలో మంచి సెంటిమెంట్ ఉండడంతో చేశామనీ, బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందనీ నాగేశ్వరరెడ్డి చెప్తున్నారు.  షూటింగ్ టైమ్‌లోనూ కొందరు బ్రాహ్మణులు ఫోనులు చేశారు. ‘మళ్లీ ఇబ్బందులు వస్తాయేమో చూసుకోండి’ అని. అటువంటి ఇబ్బందులు వచ్చే సన్నివేశాలు ఏం లేవు. వందశాతం బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందీ సినిమా అని హామీ ఇస్తున్నారు.

ఓ అమ్మాయిని కాపాడేందుకు బ్రాహ్మణ కుటుంబమంతా ప్రయత్నిస్తుంది. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని ఆ యువతిని వీళ్లంతా ఎలా కాపాడారన్నది కథాంశం.  తాత-మనవరాలి సెంటిమెంట్‌తో నడిచే చిత్రమిది.   తాతగా కోట శ్రీనివాసరావు, మనవరాలిగా ప్రగ్యా, ఆచారులుగా విష్ణు, బ్రహ్మానందంలు నటించారు. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు ప్రత్యేకంగా సినిమా కోసం రాసిన కథ ఇది.   కిట్టు నిర్మించిన సినిమాకి ఎం.ఎల్‌. కుమార్‌చౌదరి సమర్పకులు.

 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments