అందం స్వర్గానికి వెళ్లి పాతికేళ్లు..ఇప్పటికి ఆమె ఓ మిస్టరీనే

updated: April 6, 2018 18:20 IST
అందం స్వర్గానికి వెళ్లి పాతికేళ్లు..ఇప్పటికి ఆమె ఓ మిస్టరీనే

అందానికి నిర్వచనం ఆమె. అయితేనేం అర్దాంతరంగా పైనుంచి పిలుపు వచ్చి చెప్పాపెట్టకుండా ఓ రాత్రి ప్రయాణం పెట్టేసుకుంది. ఆమె వెళ్లిపోయి పాతికేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికి ఆమెను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు.

పిభ్రవరి 25, 1974న మహారాష్ట్రలో జన్మించిన దివ్యభారతి ఉత్తరాది నుంచి తెలుగుకు వచ్చింది. నిర్మాత రామానాయుడు సూపర్ హిట్ చిత్రం బొబ్బలిరాజాతో ఆమెను తెలుగుకు పరిచయం చేసారు.  

వెంకీకి సరిజోడుగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ ఒక్క సినిమాతో దివ్యభారతి అందచందాలకు తెలుగు కుర్రకారంతా ఫిదా అయిపోయింది. ఈ విజయంలో భాగస్వామ్యం ఆమె అందానికి కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. నటన - డ్యాన్సులు రెండిటిలో దివ్యభారతీ చబ్బీ లుక్ పెద్ద అస్సెట్ అయ్యింది. ఈ సినిమా హిట్టవ్వడంతో దివ్య భారతికి మరో ఐదేళ్ల కాల్షీట్ లు బిజీ అయిపోయాయి.

 శ్రీదేవి టాప్ పొజిషన్లో దూసుకెళుతున్న రోజుల్లో అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దివ్య భారతి అనతి కాలంలోనే వరుస సినిమాలతో దూసుకెళ్ళింది. అప్పట్లో ఆమెను అంతా యంగ్ సిస్టర్ ఆఫ్ శ్రీదేవి అని పిలుస్తుండేవారు కూడా.

దివ్యభారతి అందం, జోరు చూసిన వారంతా ముందు వరుసలో కొనసాగుతున్న శ్రీదేవిని పక్కకు నెట్టి ఆ ప్లేసును దివ్య భారతి చేజిక్కించుకుంటుదని అందరూ భావించారు.  

 

అప్పట్లో దివ్యభారతి జోరు ఏ రేంజిలో ఉండేదంటే ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్ల కాలంలో ఆమె దాదాపు 13 సినిమాల్లో నటించారు. వరుస సినిమాలతో అప్పట్లో ఆమె పేరు మారుమ్రోగి పోయింది. 

అయితే ఎవరూ ఊహించని విధంగా 1993లో 19 ఏళ్ల వయస్సులో ఆమె అనుమానస్పందంగా మరణించింది. అయితే దివ్యభారతి మరణించే సమయానికి ఆమె సైన్ చేసిన కొన్ని సినిమాలు సగం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన సగం పూర్తయిన సినిమాలు అప్పట్లో శ్రీదేవితో పూర్తి చేశారు. 

కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే దివ్య భారతి ముంబైలో ఓ భారీ భవంతి పైనుంచి కింద పడి మరణించటం అందరినీ షాక్ కు గురి చేసింది. తాగిన మత్తులో పైనుంచి పడిందని ఎఫ్ ఐఆర్ ఫైల్ చేసినా ఇప్పటికీ ఈ కేసు ఓ మిస్టరీనే.

చనిపోయిన ఇన్నేళ్ళు అయినా దివ్య భారతి మృతి మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ఇది ఆత్మహత్య అని పోలీసులు అప్పట్లో తేల్చారు. కానీ.. దివ్య భారతి మృతికి ఆమె భర్త సాజిద్‌నే కారణమని ఆరోపణలు ఉన్నాయి


Tags: divyabharathi, divya bharati

comments