ఈ స్వతంత్ర దినోత్సవం కి మీ స్నేహితులకు సినిమా టికెట్ బహుమానం గా ఇవ్వండి.

updated: August 14, 2018 12:35 IST
ఈ స్వతంత్ర దినోత్సవం కి మీ స్నేహితులకు సినిమా టికెట్ బహుమానం గా ఇవ్వండి.

దేశభక్తిని అంతర్గతంగా చూపిస్తూ...సినిమా అంతా చాలా ఇంట్రస్టింగ్ గా నడిపే సినిమాలు అప్పుడప్పుడూ వస్తూ ఊరట ఇస్తూంటాయి. ముఖ్యంగా రంగ్ దే బసంతి, లగాన్, మున్నాభాయి లగే రహో  వంటి సినిమాలు మన హృదయంలోకి మెల్లిగా ప్రవేశించి దేశభక్తిని మేల్కొపుతాయి. డైరక్ట్ గా ఈ సినిమాలేమీ దేశభక్తిని భోధించవు. అటువంటి సినిమానే మన తెలుగులో వచ్చిన గూఢచారి. 

అడవి శేషు... ‘క్షణం’ సినిమాతో అందరి దృష్టినీ తన వైపు ఒక్కసారిగా తిప్పుకున్నాడు.   ఇప్పుడు గూఢచారితో సినిమాని ప్రేమిస్తే..చిన్న బడ్జెట్ లో భారీ జేమ్స్ బాండ్ సినిమా తీయచ్చు అని ప్రూవ్ చేసాడు. సినిమాలో ఎన్నో ట్విస్ట్ లు, ఎన్నో ఆశ్చర్యాలు, పైకి స్పై థ్రిల్లర్ లోపల పక్కా దేశభక్తి కథ..ఇంట్రస్టింగ్ స్క్రీన్ తో  పరుగులెత్తించాడు.  ప్రతి సీన్ లోనూ పూర్తి డీటైలింగ్.. ప్రతి క్యారక్టర్  లోనూ ఏదో స్పెషాలిటీ.. పెద్ద హీరోల సినిమాలకు పోటీ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్లు..  టెన్షన్  పుట్టించే ఇంట్రస్టింగ్ ..  అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు.  ముఖ్యంగా సినిమాలో ప్రతీ పాత్ర ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ప్లాన్ చేసిన స్క్రీన్‌ప్లే సినిమాకు ఫెరఫెక్ట్ మూవీ లుక్ తెచ్చిపెట్టింది.

నిజానికి ఈ సినిమా ని డైరక్టర్ చేసింది కొత్త డైరక్టర్ అంటే ఎవరూ నమ్మరు..అంత బాగా చేసారు. ఎక్కడా ఒక్క షాట్ గా ఎగస్ట్రా అనిపించకుండా,బోర్ కొట్టకుండా లాగారు. అయితే సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ని స్క్రిప్టు దశలోనే తగ్గించేసి ఉంటే గూఢచారి..ఇంటర్నేషనల్ స్దాయిలో ఉండేది. అయినా అతనికిచ్చిన బడ్జెట్ లో అద్బుతమే చేసాడని చెప్పాలి

‘గూఢచారి’ ప్రతీ విషయంలోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో   టెర్రరిస్టుల స్థావరాన్ని మట్టుబెట్టే ఎపిసోడ్ అయితే సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. దేశభక్తి, సెంటిమెంట్‌ మేళవించిన క్లైమాక్స్‌  కేక పెట్టిస్తే...ఆ  క్లైమాక్స్ లో  వచ్చే అసలు ట్విస్టు పెద్ద షాకిస్తుంది.  ఎన్నోట్విస్ట్ లతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ పూర్తి స్దాయిలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా...మనం చూసే చాలా హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇస్తుంది. తప్పకుండా మరిన్ని ఇలాంటి సినిమాలు తెలుగులో రావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. ఇప్పటికీ మీరు ఈ సినిమా చూడకపోతే ఓ లుక్కేయండి..ఖచ్చితంగా మంచి సినిమా రికమెంట్ చేసామంటారు. తప్పకుండా , ఈ స్వతంత్ర దినోత్సవం కి మీ స్నేహితులకు సినిమా టికెట్ బహుమానం గా ఇవ్వండి . అదే మీ తోటి భారతీయులకు  మీరిచ్చే స్వతంత్ర దినోత్సవ కానుక

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Goodachari movie, Adivi Sesh, Sobhita Dulipala, Prakash Raj, Jagapathi babu, Madhu Shalini, Veenala Kishore, Anish Kuruvillaa

comments