అంతఃకరణ శుద్ధితో అమెరికా ప్రెసిడెంట్లు కూడా చేసిన తప్పే ఇది,,,

updated: April 29, 2018 19:37 IST
అంతఃకరణ శుద్ధితో అమెరికా ప్రెసిడెంట్లు కూడా చేసిన  తప్పే ఇది,,,

"భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను " అంటూ మహేష్ ..తన తాజా చిత్రం  భరత్ అనే నేనులో ప్రమాణం చేస్తారు. అయితే ఆ ప్రమాణం సమయంలో ఆయన  అంతఃకరణ శుద్ధితో  అనే పదం సరిగ్గా పలకలేకపోతారు. అది ఓ జర్నలిస్ట్ హైలెట్ చేస్తారు. ఇలాంటివి గతంలో మన రాష్ట్రంలోనే కాక మన దేశంలోనూ చాలా సార్లు జరిగాయి 

ప్రమాణం స్పీకారం సందర్బంగా పదాలను పలకలేకపోవటం అనే విషయంలో చాలామంది మంత్రుల పరిస్దితి ఇంతే..సరిగ్గా మైక్ ముందుకు పోగానే ఆవరించే ఉద్వేగం, తద్వారా కలిగే ఒత్తిడి, తడబాటు ఉంటుంది.  ఆ టెన్షన్ లో పదాలు తప్పు దొర్లుతాయి. దాంతో ఛానెల్స్ ,మీడియా రెచ్చిపోతూంటాయి. అయితే ఇది కేవలం మన దేశంలో జరిగే పొరపాటు మాత్రమే కాదు... అమెరికా వంటి పూర్తిగా అభివృధ్ది చెందిన దేశాల్లో కూడా ప్రమాణం చేసేటప్పుడు తడబడటం పొరబడటం జరిగింది. అమెరికా మాజీ  ప్రెసిడెంట్ బరాక్ ఒబామా..ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా తప్పులు, పాజ్ లు దొర్లాయని అప్పటి మీడియా హైలెట్ చేసింది. 

తదనంతరం  ఒబమా  చేత అప్పటి చీఫ్ జస్టిస్    John Roberts ( ప్రైవేట్ గా ) తిరిగి ప్రమాణం స్వీకారం చేయించారు . ఒబామా కి ముందు ఇద్దరు అమెరికా అధ్యక్షులకు ఇదే  పరిస్థితి ఎదురైంది . 

ఇలా జరిగే పొరపాటును.. .దీన్ని మీడియా హైలెట్ చేసే తీరుని ఈ సినిమా పట్టిచ్చింది. అందుకే ఈ రోజు ఈ సినిమాకు ఆ స్దాయి అప్లాజ్ దక్కుతోంది. 

 సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ డైరెక్షన్‌లో... డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని  నింపుతోంది. స్పైడర్‌తో కొంత నిరుత్సాహానికి గురైన మహేష్ ఈ సినిమాతో ఫుల్ జోష్ లోకి వచ్చేసారు.  

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: barack obama, bharat anu nenu

comments