‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ఇన్నర్ సర్కిల్ టాక్ ఏంటంటే..

updated: May 1, 2018 19:00 IST
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ఇన్నర్ సర్కిల్  టాక్ ఏంటంటే..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. పూర్తి స్దాయి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ఫైనల్ అవుట్ పుట్ ని కొంతమంది సినిమా కు చెందిన టీమ్ చూడటం జరిగింది. వారు చెప్పేదాని ప్రకారం..అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమాలో బెస్ట్ సినిమాగా నిలిచిపోనుంది.  ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అయితే పండుగే. 

  అల్లు అర్జున్‌ అనగానే గుర్తుకొచ్చే విషయం స్టైల్‌.. ఆయన ఏ పాత్ర చేసినా.. అందులో  ఓ ప్రత్యేకమైన స్టైల్‌ కనిపించాల్సిందే. తాజా చిత్రంలో ఆర్మీ అధికారిగా కనిపించనున్న బన్ని స్టైల్‌ 

విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ స్టైల్స్ సినిమా రిలీజ్ అయ్యాక కుర్రాళ్లను ఊపేస్తాయనటంలో సందేహం లేదంటున్నారు. హెయిర్‌ మొదలుకొని బన్ని ఎక్సప్రెషన్స్ వరకూ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం బన్ని,ఆయన టీమ్  ఎంత కష్టపడుతున్నారో  టీజర్స్, ట్రైలర్స్  ను చూస్తే అర్థమవుతోంది. 

లగడపాటి శిరీషా శ్రీధర్‌, బన్ని వాసులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.   వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, అర్జున్, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ బాణీలు సమకూరుస్తున్నారు


Tags: naa peru surya, bunny, allu arjun, vakkantham vamshi, lagadapati sridhar

comments