‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ని హిట్ కు కారణం ఇవే

updated: May 10, 2018 11:26 IST
‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ని హిట్ కు కారణం ఇవే

కొన్ని డైలాగులు లేదా సన్నివేశాలు దర్శకుడు లేదా రచయిలతలోని సృజనాత్మకతను, డెప్త్ ని పట్టిస్తాయి. అవే సినిమా హిట్ కు కూడా కారణం కావచ్చు. బయిట జనాల్లో అవి హాట్ టాపిక్ గా మారచ్చు. అలాంటి డిటేలింగే అల్లు అర్జున్ తాజా ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’కు ప్లస్ అయ్యింది. అందులో ఉదాహరణకు ఒకటి మీకు గుర్తు చేస్తున్నాం. ఇండియన్ ఆర్మికు చెందిన పది బెస్ట్ కోట్స్ లో ఒకటైన  "Only best of the friends and worst of the enemies visit us" ( స్నేహితుల్లో బెస్ట్, శత్రువుల్లో వరస్ట్ అయిన వారు మాత్రమే మమ్మల్ని కలుస్తారు) ని సినిమాలో ఆర్మి హెడ్ క్వార్టర్స్ దగ్గర కనపడే బోర్డ్ గా చూపిస్తారు. ఇది చూపించకపోయినా సినిమా కథకు వచ్చే నష్టమేమీ లేదు కానీ చూపటం వలన వారు సినిమాని ఎంత నిజాయితీ,నిబద్దతతో చేసారో అర్దం చేసుకునే అవకాసం కలిగించింది. వారు చేసిన రీసెర్చ్ మనకు అర్దమవుతుంది. అలాంటివి  బోలెడు విషయాలు మనకు ఈ సినిమాలో కనపిస్తాయి. 

సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక భాధ్యత కూడా కలిగి ఉంటే  మంచిది అని ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అదీ తొలి సినిమా చేస్తున్నప్పుడు అలా ఆలోచించాలంటే భయం వేస్తుంది. ఏ మాస్ సినిమానో చేసి సూపర్ హిట్ కొట్టి సెటిల్ అయ్యిపోవాలనుకుంటారు.  కానీ చిత్రంగా రచయత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ సమాజం పట్ల తనుకున్న భాధ్యతను అత్యంత శక్తివంతమైన మీడియం అయిన సినిమా ద్వారా  వ్యక్త పరచాలనుకున్నారు. అందుకు దర్శకుడుగా తన తొలి చిత్రం  ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ని వేదికగా ఎంచుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆయన ఆలోచనకు అల్లు అర్జున్, నిర్మాత లగడపాటి శ్రీధర్,నాగబాబు చేయూత నిచ్చారు.

 అందుకే కేవలం కమర్షియల్ సినిమాగానే కాకుండా కొద్ది క్షణాలు పాటు ఆలోచనలో పడేస్తూ...మన దేశంపైనా, దేశాన్ని రాత్రింబవళ్లూ రక్షిస్తున్న ఆర్మిపైనా ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేస్తూ ఈ సినిమా వచ్చింది.  ముఖ్యంగా బన్ని ఈ పాత్రలో ఒదిగిపోయారు అనటం చాలా చిన్నమాట.‘నాకు నా దేశం కావాలి ఇచ్చెయ్’ అంటూ వీరసైనికుడిగా ఆయన విశ్వరూపం చూపించారు.

 ఇక సినిమాలో  ముస్తఫా అనే రిటైర్డ్‌ మిలటరీ సైనికుడి పాత్రలో ...ఓ జీవితకాలం గుర్తుండిపోయే పాత్రను చేసారు.  అన్వర్‌ అనే కుర్రాడి పాత్రలో నటించిన లగడపాటి శ్రీధర్‌ తనయుడు  కనపడింది కొద్ది సేపే అయినా అసలు ఎక్కడా కొత్త వాడిలా కనపించకుండా అలవోకగా చేసుకుంటూ పోయాడు అనిపించింది. హ్యాట్యాఫ్ టు హిమ్.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: naa peru surya, lagadapati sridhar, vakkantham vamshi

comments