ట్రెండ్ ని సెట్ చేసే పాటలు విడుదలయ్యాయి విన్నారా?

updated: August 9, 2018 17:36 IST
ట్రెండ్ ని సెట్ చేసే పాటలు విడుదలయ్యాయి విన్నారా?

ట్రెండ్ ని సెట్ చేసే పాటలు విడుదలయ్యాయి విన్నారా?

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, గూఢచారి, చి.ల.సౌ..ఇలా వరస పెట్టి తెలుగు సినిమా కొత్త నీటిని ఆహ్వానిస్తున్న సమయం ఇది. దర్శకులు,రచయితలు, సంగీత దర్శకులు, వివిధ క్రాఫ్టులకు చెందిన టెక్నీషియన్స్ సరికొత్త ఆలోచనలతో సందడి చేస్తున్నారు. ఈ సమయంలో 'అల' అంటూ మరో కొత్త చిత్రం వైవిధ్యమైన కాన్సెప్టుతో మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు చెందిన టీజర్ ఇప్పటికే రిలీజయ్యి...సినిమా రిలీజ్ కోసం యూత్ ఎదురుచూసేలా చేసింది. ఆ తర్వాత రీసెంట్ గా ఈ సినిమా పాటలు రిలీజ్ అయ్యి..సినిమాపై అంచనాలు పెంచేసాయి. 

నూతన సంగీత దర్శకుడు శ్రీనివాస శర్మ అద్బుతంగా స్వరపరచిన పాటలు ఈ సినిమాకు ప్రత్యేకత. పాటలు ఒక సారి వింటే అలా ఆ రోజంతా వెంటాడటం వీటి ప్రత్యేకత. తొలి సినిమాతోనే సంగీత ప్రియుల దృష్టిని ఈ సంగీత దర్శకుడు..స్వతహాగా మంచి సింగర్. శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన పట్టిన వాడు. తన గాన మాధుర్యంతో భగవగ్దీత వంటి ప్రాజెక్టులను అలవోకగా జనాల్లోకి తీసుకు వెళ్లినవాడు. 

ఇక ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే...ప్రతీది ఆణిముత్యమే. భార్గ‌వ్, శిల్పిక‌, మాళ‌విక ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన మూవీ  ఈ అల‌.. సినిమాకు శ‌ర‌త్ పాలంకి ద‌ర్శ‌కుడు.. సౌజ‌న్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై పాలంకి శ‌ర‌త్ చంద్ర ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ది.. 

ముఖ్యంగా  కౌగిలిలో అనే సాంగ్ ఇప్పటికే కుర్రాళ్ల నాలుకలపై ఆడుతోంది..సిరాశ్రీ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను చిన్మ‌య శ్రీ‌పాద ఆల‌పించింది.. సంగీతం శ్రీ‌నివాస శ‌ర్మ రాణి స‌మ‌కూర్చారు.మరి మీరూ విని మీ అభిప్రాయం పంచుకోండి. పేరుకు చిన్న సినిమా ఆడియో అయినా ...తెలుగులో టాప్ సింగర్స్ పాడటం ఇందులో చెప్పుకోదగ్గ విశేషం

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: Ala movie songs, Srinivas Sharma, Bhargav Kommera, Shilpika, Malavika, Sarat Palanki

comments