‘రంగస్థలం’పై అద్బుతమైన విశ్లేషాత్మకమైన రివ్యూ

updated: May 1, 2018 09:00 IST

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్‌ నటన, సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. రామలక్ష్మిగా 
సమంత నటననూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడేసారు. సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్ట్ లు పెట్టేసారు. వెబ్ సైట్స్ రివ్యూలు ఇచ్చేసాయి. అయితే ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణగారు మాత్రం వాటిన్నటికి విభిన్నంగా వివరణాత్మకంగా తనదైన శైలిలో ఈ సినిమాలో హెలెట్స్ ఏమిటి..మైనస్ లు ఏమిటి అనే విషయాలు వివరించారు.
1980ల కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకెళ్లింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది.   ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌... ‘రంగస్థలం’ ఆస్కార్‌ స్థాయి  చిత్రమని ప్రశంసించారు. 

ఆది, జగపతిబాబు, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను 
నిర్మించారు. 

గీతాకృష్ణగారి గురించి ప్రత్యేకంగా  ఈ రోజు పరిచయం చేయనక్కర్లేదు. ఆయన చేసిన సంకీర్తన,కోకిల వంటి చిత్రాలు ఆయనేంటో చెప్తాయి.  ఓ గొప్ప టెక్నీషియన్ గా ఆయనకు పేరుంది. అలాగే అదే సమయంలో ఆయన ఫిల్మ్ ఇనిస్టిట్యుట్ ని సైతం నడుపుతున్నారు. ఓ ప్రక్క తన అద్బుతమైన అనుభవం , మరో ప్రక్క రోజూ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూండే ఆయన అభిప్రాయాలు చాలా విలువైనవిగా ఉంటాయనటంలో సందేహం లేదు. ఈ రివ్యూ ని  లవంగం డిజిటల్ ఫ్యాక్టరీ ఛానల్ ద్వారా అందించడం జరిగింది   ‘రంగస్థలం’గురించి ఆయనేం మాట్లాడారో ఈ క్రింద లింక్ లో చూద్దాం. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: rangasthalam review, geeta krishna, lavangam digital factory

comments