దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ

updated: July 3, 2018 20:54 IST
దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది. మ‌న భూమిని మ‌న‌మే కాపాడుకోవాలి. అందుక‌నే చెట్ల‌ని నాటాలి` అని అన్నారు హీరోయిన్‌ శివానీ రాజ‌శేఖ‌ర్‌. ఈమె పుట్టిన‌రోజు జూలై 1. ఈ సంద‌ర్భంగా శివానీ రాజ‌శేఖ‌ర్‌, రాజ‌శేఖ‌ర్‌, జీవిత దంపతులు మేడ్చ‌ల్ రింగురోడ్డు వ‌ద్ద హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అలాగే దేవ‌నార్ అంధుల పాఠ‌శాల‌కు వెళ్లి అక్క‌డి పిల్ల‌ల‌ను క‌లిసి ముచ్చ‌టించారు. అక్క‌డే కేక్ క‌ట్ చేసి త‌న పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా... శివానీ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``ఈ పుట్టిన‌రోజును ఇలా కొత్త‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇక‌పై ప్ర‌తి పుట్టిన‌రోజును ఇలాగే మీ మ‌ధ్య‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటాను. ఇక్క‌డి పిల్ల‌ల తెలివి తేట‌ల్ని చూస్తుంటే ఆశ‌ర్యంగా, ఆనందంగా ఉంది. మా అందరి కంటే మీరే చాలా గ్రేట్‌`` అన్నారు. 

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``ఇక్క‌డున్న పిల్ల‌లు సాధించిన విజయాలు చూస్తేంటే మేం ఇంకా ఎంతో సాధించాల‌ని అనుకోవాలి. దేవుళ్ల‌తో స‌మాన‌మైన పిల్ల‌లు మీరు. మీరింకా ఎంతో ఉన్న‌తి సాధించాల‌ని కోరుకుంటున్నాం. ఇక్క‌డ క‌డుతున్న స్కూల్‌కి మా చేత‌నైన స‌హాయం చేస్తాం`` అన్నారు

Click here for gallery - Planting sapplings 

Click here for gallery - Devnar School for the blind

 


Tags: Shivani Rajasekhar, 2states, jeevita rajasekhar

comments