శ్రీదేవి గురించిన ఆమె చేసిన ట్వీట్..వర్మకు బాగా నచ్చింది, అందుకే రీట్వీట్

updated: February 25, 2018 19:49 IST
శ్రీదేవి గురించిన ఆమె చేసిన  ట్వీట్..వర్మకు బాగా నచ్చింది, అందుకే రీట్వీట్

అందానికి అర్థం చెప్ప‌మంటే పెద్ద‌గా ఆలోచించకుండా.. క‌ష్ట‌ప‌డి డిక్ష‌న‌రీలు తిర‌గేయ‌కుండా సింపుల్ గా శ్రీదేవిని చూపిస్తే స‌రిపోతుంది అనటంలో అతిశయోక్తి లేదు . అందుకేనేమో....శ్రీదేవిపై  

'గోవిందా గోవిందా' లో చిత్రీకరించిన  ఈ పాట ఇప్పుడు అందరికీ గుర్తు వస్తోంది.  

"అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో

ఎంత గొప్ప సొగసురో యాడ దాచినావురో

పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు

రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా...

కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా "

అనే పాటనే అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ అందం తరిలిరాని లోకాలకు వెళ్లిపోయిందంటే బాధగానే ఉంటుంది. ముఖ్యంగా రామ్ గోపాల వర్మకు ఆమె అంటే పిచ్చి...అందుకే ఈ రోజంతా ఆమె గురించి బాధపడుతూ కంటిన్యూగా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో శ్రీదేవి పై వచ్చిన ట్వీట్స్ ని సైతం ఆయన నిశితంగా చూస్తున్నారు. ఆ విషయం మనకు శ్రీదేవికి అంజలి ఘటిస్తూ చేసిన ఓ ట్వీట్ ని రీ ట్వీట్ చేయటంతో అర్దమవుతుంది. హరిణి అనే ఆమె చేసిన ట్వీట్ ఆయనకు బాగా నచ్చటంతో వెంటనే రీ ట్వీట్ చేసారు. మీరూ ఆ ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు.

 తన వయస్సు  52  దాటినా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం శ్రీ‌దేవి సొంతం అంటే అతిశయోక్తికాదు. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో 25 ఏళ్ల పాటు చ‌క్రం తిప్పిన బ్యూటీ. బాల‌న‌టిగా ఎంట‌రై.. హీరోయిన్ గా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న ముద్దుగుమ్మ‌. తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. 1967లో బాలనటిగా ‘కన్దన్‌ కరుణాయ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెరపై కనిపించారు. 

1976లో కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మాండ్రు ముడిచు’లో కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్‌’.. హీరోయిన్‌గా ఆమెకు తొలి చిత్రాలు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించారు. 

 

1975-85 మధ్యకాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్‌ వన్‌ కథానాయిక స్థానానికి ఎదిగారు. ఆయా భాషల్లో స్టార్ హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తల్లి మరణం తర్వాత శ్రీదేవి బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌ కపూర్‌ సోదరుడు బోనీకపూర్‌ను 1996జూన్‌ 2న వివాహం చేసుకున్నారు. వారికి జాహ్నవి, ఖుషి ఇద్దరు పిల్లలు.

   శ్రీదేవి మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తెలుగు 100 మనస్పూర్తిగా ఈ మహానటికి నివాళులు అర్పిస్తోంది. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments