పోస్ట్‌లు

‘గాంధీ తాత చెట్టు’ఎక్కిన సుకుమార్ కుమార్తె

కొందరు చిన్నతనం నుంచే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆశ్చర్య పరుస్తూంటారు.  అలా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం అవుతూనే ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఆ చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఈ క్రమంలో సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది.  ప్ర‌స్తుతం సుకృతి వేణి  ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్ 8 చదువుతోంది.   ఈ చిత్రం గ‌తంలో కూడా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. సుకృతి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లతో పాటు ఈ చిత్రం అనేక అవార్డుల‌ను గెలుచుకుంది. . పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పలు చిత్రోత్సవాల్లో సత్తా చాటింది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతి వేణి బండ్రెడ్డిని అవార్డులు వ‌రించాయి. 11వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్త‌మ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి బెస్ట్ ఫ
ఇటీవలి పోస్ట్‌లు