ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హరిహర వీర మల్లు ట్రైలర్

 

‘గాంధీ తాత చెట్టు’ఎక్కిన సుకుమార్ కుమార్తె



కొందరు చిన్నతనం నుంచే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆశ్చర్య పరుస్తూంటారు.  అలా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం అవుతూనే ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఆ చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఈ క్రమంలో సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది.  ప్ర‌స్తుతం సుకృతి వేణి  ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్ 8 చదువుతోంది.ఈ చిత్రం గ‌తంలో కూడా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. సుకృతి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లతో పాటు ఈ చిత్రం అనేక అవార్డుల‌ను గెలుచుకుంది.

    పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పలు చిత్రోత్సవాల్లో సత్తా చాటింది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతి వేణి బండ్రెడ్డిని అవార్డులు వ‌రించాయి. 11వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్త‌మ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకోగా, జైపూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ల్ తో పాటు 8వ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవ‌డం విశేషం.

 మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తబితా సుకుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి  చిన్న వయసులోనే తన మేధస్సుతో ఆశ్చర్యపరుస్తున్న ఈ పాప.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృషించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హరిహర వీర మల్లు ట్రైలర్